సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Nov 14, 2020 , 03:00:20

ప్రకృతి వైద్యులకు జాతీయ అవార్డు

ప్రకృతి వైద్యులకు జాతీయ అవార్డు

ఖమ్మం: ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన ప్రముఖ ప్రకృతి వైద్యుడు డాక్టర్‌ కేవై రామచందర్‌రావు ఆయన సతీమణి డాక్టర్‌ ఎన్జీ పద్మ దంపతులు ప్రతిష్టాత్మక ‘అబ్దుల్‌ కలామ్‌ జాతీయ అవార్డు’కు ఎంపికయ్యారు. ఈనెల 15న కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ఖాన్‌ వీరికి అవార్డుతో పాటు ‘ ఏ లివింగ్‌ చరక’ అనే బిరుదును ప్రదానం చేయనున్నారు. ఈ దంపతులిద్దరూ నేలకొండపల్లిలోని సిద్ధార్థనగర్‌లో 22 ఏండ్లుగా ఎంతోమందికి ప్రకృతి వైద్యం అందిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీతో కలిసి 100 ఎకరాల విశాలమైన ప్రకృతి ఒడిలో ’రామచంద్ర ప్రకృతి ఆశ్రమాన్ని’ప్రారంభించారు. వీరి వద్ద ప్రకృతి వైద్యం కోసం ఏడు రాష్ర్టాల నుంచి భారీ సంఖ్యలో రోగులు వస్తుంటారు. ఢిల్లీలోని క్యాపిటల్‌ ఫౌండేషన్‌, జస్టిస్‌ కృష్ణయ్య ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్‌ రామచందర్‌రావు దంపతులకు ఈ జాతీయ అవార్డును ప్రకటించాయి.