గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 14, 2020 , 21:16:53

దేశం మొత్తం తెలంగాణ‌కు తోడుగా ఉంటుంది : రాష్ర్ట‌ప‌తి

దేశం మొత్తం తెలంగాణ‌కు తోడుగా ఉంటుంది : రాష్ర్ట‌ప‌తి

హైద‌రాబాద్ : దేశం మొత్తం తెలంగాణ‌కు తోడుగా ఉంటుంద‌ని రాష్ర్ట‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. రాష్ర్టంలో ఎడ‌తెరిపిలేకుండా కురుస్తున్న వ‌ర్షాల‌పై రాష్ర్ట‌ప‌తి ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. వ‌ర్ష ప‌రిస్థితుల‌పై గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై, సీఎం కేసీఆర్‌తో మాట్లాడిన‌ట్లు చెప్పారు. హైదరాబాద్, తెలంగాణలోని ప‌లు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల జరిగిన విధ్వంసం, ప్రాణ నష్టంపై రామ్‌నాథ్ విచారం వ్య‌క్తం చేశారు. ఈ సంక్షోభ సమయంలో దేశం మొత్తం తెలంగాణ ప్రజలకు తోడుగా ఉంటుందని కోవింద్ పేర్కొన్నారు.


logo