గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 26, 2020 , 22:02:53

నర్సింగాపూర్‌ అడవుల్లో పెద్దపులి సంచారం!

నర్సింగాపూర్‌ అడవుల్లో పెద్దపులి సంచారం!

భీమారం : మంచిర్యాల జిల్లా భీమారం మండలం నర్సింగాపూర్‌ అడవిలో గురువారం ఉదయం ఏ1(ఆసిఫాబాద్‌) పెద్దపులి సంచరించింది. కోటపల్లి మండలం నుంచి చెన్నూర్‌ మండలం బుద్దారం మీదుగా నర్సింగాపూర్‌ సమీపంలోని నర్సాపురం ఒర్రెలోకి వచ్చింది. అటుగా వెళ్లిన అటవీ సిబ్బంది(వాచర్‌) ఓ చోట పులి పాదముద్రలను గుర్తించాడు. ఉదయం వేళ నీళ్లు తాగిన ఆనవాళ్లు ఉండగా, 20 రోజుల క్రితం ఇదే పులి నర్సింగాపూర్‌ మీదుగా గొల్లవాగు ప్రాజెక్ట్‌ వరకు వచ్చి వెళ్లిందని అటవీ శాఖ అధికారులు చెప్పారు. ఎవరూ అడవుల్లోకి వెళ్లవద్దని అలాగే పులికి హాని తలపెట్టవద్దని నర్సింగాపూర్‌, బూర్గుపల్లి, భీమారం గ్రామాల ప్రజలకు అధికారుల సూచనలు చేశారు.logo