శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 28, 2020 , 16:56:36

రైల్వే కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

రైల్వే కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

వరంగల్ రూరల్ : హైదరాబాద్ నాంపల్లి రైల్వే కోర్టుకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమం ఉధృతి సమయంలో తెలంగాణ సెగ దేశమంతా తాకాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే పెద్ది ఆధ్వర్యంలో 2009లో నెక్కొండ రైల్వే స్టేషన్‌లో సుమారు 48 గంటల పాటు రైల్ రోకో నిర్వహించారు. ఉత్తర, దక్షిణ రాష్ట్రాలను అనుసంధానం చేసే రాకపోకలను నిలిపివేసినందుకు గాను ఎమ్మెల్యేతో పాటు 38 మందిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద క్రిమినల్ కేసును నమోదు చేశారు. ఈ కేసును కాజీపేట రైల్వే కోర్టు నుంచి హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వే ప్రత్యేక సెషన్స్ కోర్టుకు బదిలీ చేశారు. కేసు విచారణ కోసమై నాటి ఉద్యమకారులు కోర్టు ముందు నేడు హాజరు కాగా తిరిగి కేసును నవంబరు 10వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి వరప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.