మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Aug 05, 2020 , 19:54:40

నారాయణఖేడ్‌లో వారంపాటు వ్యాపార కార్యకలాపాలు బంద్‌

నారాయణఖేడ్‌లో వారంపాటు వ్యాపార కార్యకలాపాలు బంద్‌

సంగారెడ్డి : జిల్లాలోని నారాయణఖేడ్‌ పట్టణంలో గడిచిన రెండు రోజుల్లో 16 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో గురువారం నుంచి వారం రోజులపాటు పట్టణంలోని అన్ని దుకాణాల కార్యకలాపాలను వారం రోజుల పాటు బంద్‌ పాటించేలా మున్సిపల్‌ అధికారులు చర్యలు చేపట్టారు. పట్టణంలో గడిచిన సోమవారం 10 కేసులు, మంగళవారం 6 కేసులు నమోదయ్యాయి. దీంతో వ్యాపారులతో అధికారులు సమావేశమై చర్చించారు. మున్సిపల్‌ చైర్మన్‌ రుబీనా బేగం, వైస్‌ చైర్మన్‌ ఏ. పరుశురామ్‌ నేతృత్వంలోని బృందం మున్సిపల్‌ అధికారుల నిర్ణయానికి ఏకగ్రీవంగా సమ్మతి తెలిపారు.


logo