ఆదివారం 12 జూలై 2020
Telangana - Jul 01, 2020 , 00:07:45

పోటీలేని తెలుగువాడు

పోటీలేని తెలుగువాడు

అప్పటికే కేంద్రంలో కీలక శాఖల నిర్వహణ.. వయసు కూడా మీద పడింది.. పైగా ఎన్నికల్లో టికెట్‌ దక్కలేదు.. దీంతో రాజకీయ సన్యాసం తీసుకొని ఆధ్యాత్మిక జీవితంవైపు అడుగులు వేద్దామనుకున్నారు పీవీ నరసింహారావు. కానీ, అనుకోకుండా ప్రధాని పదవి వరించింది. 1991 ఎన్నికల ప్రచారంలో రాజీవ్‌గాంధీ హత్యకు గురవడంతో, కాంగ్రెస్‌ పెద్దలు పీవీని ప్రధానిని చేశారు. అప్పటికి లోక్‌సభలో గానీ, రాజ్యసభలో గానీ ఆయన సభ్యుడు కాదు. ప్రధాని పదవి చేపట్టాక ఆరు నెలలలోపు పార్లమెంటుకు ఎన్నిక కావాల్సి ఉండింది. నంద్యాల నుంచి నామినేషన్‌ వేయాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్‌, తెలుగు దేశం పార్టీలు బద్ధ శత్రువులు అయినప్పటికీ.. పీవీ మన తెలుగువాడు అన్న అభిమానంతో ఎన్టీఆర్‌ టీడీపీ నుంచి అభ్యర్థిని నిలపలేదు. ఇది రాజకీయాల్లో ఒక అపురూప సంఘటన. దేశంలో అత్యున్నత పదవిలో ఉన్న తెలుగువాడిని సమున్నత స్థానాన్ని కొనసాగించాలన్న ఉద్దేశంతో ఓటర్లు పీవీకి భారీ మెజారిటీ ఇచ్చారు.


logo