ఆదివారం 31 మే 2020
Telangana - May 06, 2020 , 22:25:39

వైభవంగా నృసింహ జయంతి పూజలు..

వైభవంగా నృసింహ జయంతి పూజలు..

ధర్మపురి : నవ నారసింహక్షేత్రాల్లో ఒకటైన ధర్మపురిలో బుధవారం నృసింహ జయంతి పూజలు వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి పురుషసూక్తం, శ్రీసూక్త, కల్పోక్త, న్యాసపూర్వక షోడశోపచార పూజ, సహస్రనామార్చన, పంచోపనిషత్తులతో అభిషేకం, లక్ష తులసి అర్చన కార్యక్రమాలు  నిర్వహించారు. సాయంత్రం స్తంబోద్భవ కాలమున విశేష పూజలు నిర్వహించారు. కార్యక్రమాల్లో ఈఓ శ్రీనివాస్‌, సూపరింటెండెంట్‌ ద్యావళ్ల కిరణ్‌, వేదపండితులు బొజ్జ రమేశ్‌శర్మ, ముత్యాల శర్మ, ఉప ప్రధాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచార్యులు తదితరులు ఉన్నారు.
logo