సోమవారం 23 నవంబర్ 2020
Telangana - Nov 16, 2020 , 15:30:32

వెబ్‌కాస్టింగ్‌ కోసం పేర్లు నమోదు చేసుకోవాలి : లోకేశ్‌కుమార్‌

వెబ్‌కాస్టింగ్‌ కోసం పేర్లు నమోదు చేసుకోవాలి : లోకేశ్‌కుమార్‌

హైదరాబాద్‌ : వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ కేంద్రాలను పర్యవేక్షించనున్నట్లు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. వెబ్‌ కాస్టింగ్‌ కోసం రెండువేల మంది వలంటీర్లు దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు. మరింత మంది వలంటీర్లు అవసరమని ఆయన తెలిపారు. ఆసక్తి ఉన్న ఇంజినీరింగ్‌ విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. మైజీహెచ్‌ఎంసీ యాప్‌ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని చెప్పారు. అలాగే http://bit.ly/GHMCELECTIONS-2020 ద్వారా కూడా పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.