గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Aug 11, 2020 , 23:27:04

ఆహ్వాన పత్రికలపై స్వదస్తూరిలో పేర్లు

ఆహ్వాన పత్రికలపై స్వదస్తూరిలో పేర్లు

పీవీ నరసింహారావు నిరాడంబరంగానే జీవించారు. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా అయినా సరే సాదాసీదా మనిషిగానే ఉన్నారు. నిగర్విగా పేరుపొందారు. ఎప్పుడూ.. ఎవరితోనూ బేషజాలకు పోయిన దాఖలాల్లేవు. మంథని శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో పర్యటించిన ప్రతీ సందర్భంలో అతిసామాన్యులతో అరుగులపై కూర్చొని సమస్యలను తెలుసుకునేవారు. అదీగాక పీవీ తన కూతుళ్లు, కుమారుల వివాహాది శుభకార్యాలకు నియోజకవర్గ పరిధిలోని పెద్దలందరికీ స్వహాస్తాక్షరాలతో  పేర్లు రాసి ఆహ్వాన పత్రికలను పంపేవారు. ఇక శుభకార్యానికి హాజరయ్యే అతిథులను, చిన్నస్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకున్న వివిధ ఉద్యోగులను, రాజకీయ నేతలను, స్నేహితులను, బంధువులను మండప ముఖద్వారం వద్దనే ఉండి ఆప్యాయంగా పలకరిస్తూ ఆహ్వానించేవారు.


logo