శనివారం 04 జూలై 2020
Telangana - Jun 06, 2020 , 07:54:45

నవ వసంతాల నమస్తే తెలంగాణ

నవ వసంతాల నమస్తే తెలంగాణ

‘చదువ నేర్చిన పాఠకుల కోసమే పత్రిక అనుకుంటారు అందరూ! కానీ గొంతు వినిపించలేని సామాన్యులకు గొంతుకనివ్వడమే పత్రిక నిజమైన బాధ్యత!’

-నమస్తే తెలంగాణ ప్రారంభం రోజు కేసీఆర్‌


కొండొకచో అసాధ్యమనే అనిపించవచ్చు.

అడ్డంకులు అనేకం ఉండి ఉండవచ్చు.

కాళ్లూని నిలబడిన నేలకు ఎగియాలనుకున్న ఎత్తుకు మధ్య దూరం సుదూరంగానే కన్పించవచ్చు.

ప్రత్యర్థి ఎదుట నిలిచి గెలువడందుస్తరమని ఆందోళన పడొచ్చు.

తల్లివేరుకు దూరమవుతున్నామని తల్లడిల్లడమూ తప్పకపోవచ్చు.


అయితేనేం...

మనసు గట్టిగుంటే... 

ప్రాణం పట్టుగుంటే...

గుండెలో ఊపిరి గురిపెట్టి దీటుగ ఉంటే...

ఎంత ఎత్తుకైనా ఎగురవచ్చు. 

పచ్చటి పతాకమై వికసించవచ్చు.


ఆలస్యమైతే  కావచ్చు.. 

కానీ అవతరణ, అభివృద్ధి ఎన్నటికీ ఆగవు!!


ఉద్యమం కోసం ఉద్యమ స్ఫూర్తితో మొదలై... 

తెలంగాణ రాష్ర్టానికి పురుడు పోసి.. ప్రత్యేక రాష్ట్ర ప్రగతి ఉద్యమాన్ని ప్రతిరోజూ పాఠకులకు అందిస్తున్న నమస్తే తెలంగాణ పత్రిక 9వ పుట్టిన రోజు నేడు. 

పదో వసంతంలోకి ప్రవేశిస్తున్న వేళ యావత్‌ తెలంగాణ ప్రజానీకానికి, పాఠకులకు, ప్రకటనకర్తలకు, ఏజెంట్లకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు. కృతజ్ఞతలు.

- ఎడిటర్‌, నమస్తే తెలంగాణ


logo