ఆదివారం 17 జనవరి 2021
Telangana - Jan 06, 2021 , 02:11:15

జర్మనీ పత్రికలో నమస్తే తెలంగాణ కార్టూన్‌

జర్మనీ పత్రికలో నమస్తే తెలంగాణ కార్టూన్‌

హైదరాబాద్‌, జనవరి 5 (నమస్తే తెలంగాణ): నమస్తే తెలంగాణ కార్టూన్‌కు అరుదైన గౌరవం లభించింది. జర్మనీకి చెందిన ప్రతిష్ఠాత్మక పత్రిక ‘సడష్చే జైతుంగ్‌ (suddeutsche zeitung)..  కొవిడ్‌పై ప్రపంచవ్యాప్తంగా కార్టూన్లను ఆహ్వానించగా.. నమస్తే తెలంగాణ కార్టూనిస్ట్‌ మృత్యుంజయ వేసిన కార్టూన్‌ ఎంపికైంది. కరోనా మహమ్మారి 2021 లో ఎలా ఉండబోతున్నది? మన దైనందిన జీవితాల్లో ఎలాంటి మార్పులు తేనున్నది? అన్న అంశంపై కార్టూన్ల రూపంలో తమ అభిప్రాయాలను తెలుపాలని కోరింది. వడపోత అనంతరం 18 దేశాలనుంచి 22 మంది కార్టూనిస్టులు పంపించిన 27 కార్టూన్లను ఎంపికచేసి తన పత్రికలో ప్రచురించింది. వాటిలో నమస్తే తెలంగాణ కార్టూన్‌కు చోటు లభించడం విశేషం. తమ పత్రికలో ప్రచురితమైన ఒక్కో కార్టూన్‌కు 150 యూరోల చొప్పున జర్మనీ పత్రిక పారితోషికాన్ని ప్రకటించింది.