మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 11, 2020 , 16:38:31

‘నమస్తే’ ఎఫెక్ట్‌.. రిజిస్ట్రేషన్‌ కాని వాహనాలు సీజ్‌

‘నమస్తే’ ఎఫెక్ట్‌.. రిజిస్ట్రేషన్‌ కాని వాహనాలు సీజ్‌

సూర్యాపేట: ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో మంగళవారం వచ్చిన కథనం ‘వాహనాలు కొన్నారు.. రిజిస్ట్రేషన్‌ మరిచారు’ అనే వార్తకు పోలీసులు వెంటనే స్పందించారు. ఇవాళ పట్టణంలో వాహనాలను తనిఖీ చేపట్టిన ట్రాఫిక్‌ పోలీసులు.. పదికి పైగా రిజిస్ట్రేషన్‌ కాని వాహనాలను సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆర్టీవో అధికారులు, పోలీసులు మాట్లాడుతూ.. వాహనాలు కొన్నప్పుడు విధిగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని తెలిపారు. లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు.


logo
>>>>>>