సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 12, 2020 , 01:18:42

మనమంతా ఒక్కటే

మనమంతా ఒక్కటే
  • ఈ సందేశం దేశ ప్రజలకు పంపించాలి
  • లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ పక్ష నేత నామా నాగేశ్వరరావు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:మనమంతా ఒక్కటే, దేశమంతా ఒక్కటే, భారతీయులం అంతా కలిసిమెలిసి ఉన్నామనే సందేశాన్ని పార్లమెంట్‌ వేదికగా ప్రజలకు పంపించాల్సిన అవసరం ఉన్నదని లోక్‌సభలో టీఆర్‌ఎస్‌పక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. బుధవారం లోక్‌సభలో ఢిల్లీ అల్లర్లపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడు తూ.. లోక్‌సభకు అన్నివర్గాలు, మతాల వ్యక్తులు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, దేశం లో కూడా అన్నిమతాలు, కులాలవారు నివసిస్తున్నారని చెప్పారు. ఒక విషయంపై మాట్లాడుతున్నప్పుడు భిన్నాభిప్రాయాలకు తావులేకుండా చూడాల్సిన బాధ్యత మనపైనే ఉన్నదన్నారు. ఢిల్లీ ఘటన చర్చ సమయంలో కొందరు సభ్యులపై తీసుకొన్న చర్యల విషయంలో పునరాలోచించాలని స్పీకర్‌ను కోరారు. పెద్ద మనసుతో సభ్యులపై విధించిన సస్పెన్షన్‌ను రద్దుచేయాలన్నారు. 


అగ్నిప్రమాదాలపై సమాచారమిస్తున్నాం..

అడవుల్లో చెలరేగుతున్న మంటల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆయా రాష్ర్టాలు, నమోదిత మొబైల్‌ వినియోగదారులకు తెలియజేస్తూ అప్రమత్తం చేస్తున్నామని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి బాబుల్‌ సుప్రియో తెలిపారు. అడవులు, పర్యావరణం, వాతావరణ పరిస్థితుల మార్పులను తెలుసుకొనేందుకు శాస్త్రీయ విధానాలను అవలంబిస్తున్నామని చెప్పారు. బుధవారం లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ పక్షనేత నామా నాగేశ్వరరావు  అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.


logo