గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 06, 2020 , 01:52:36

కరోనాకు ప్రత్యేక నిధులు

కరోనాకు ప్రత్యేక నిధులు
  • లోక్‌సభలో కేంద్రాన్ని కోరిన నామా

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు తక్షణమే ప్రత్యేక నిధులు విడుదల చేయాలని లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ పక్షనేత నామా నాగేశ్వర్‌రావు కోరారు. గురువారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అంతేవేగంతో దానిని అరికట్టాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఇందుకు అవసరమైన పరికరాలు, యంత్రాలు, క్రిటికల్‌ ఎక్విప్‌మెంట్‌ను రాష్ట్రాలకు వెంటనే సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. తెలంగాణలో అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకున్నదని చెప్పారు. ప్రత్యేకవార్డులను ఏర్పాటుచేయడంతోపాటు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని తెలిపారు.


logo