బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 03, 2020 , 01:30:59

ఢిల్లీ అల్లర్లపై చర్చ తప్పనిసరి

ఢిల్లీ అల్లర్లపై చర్చ తప్పనిసరి
  • స్పీకర్‌తో అఖిలపక్ష భేటీలో
  • నామా నాగేశ్వరరావు డిమాండ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఢిల్లీలో జరిగిన హింసపై లోక్‌సభలో చర్చించి, ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించాలని టీఆర్‌ఎస్‌ పక్షనేత నామా నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై దేశవ్యాప్తంగా కొన్ని వర్గాల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఢిల్లీతోపాటు పలుప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా అధ్యక్షతన సోమవారం అఖిలపక్ష నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నామా మాట్లాడుతూ, సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై కేంద్రం స్పందించాలని కోరా రు. ఈ అల్లర్ల కారణంగా ఒక్క ఢిల్లీలోనే 46 మంది చనిపోయారని, ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. ఢిల్లీలో మళ్లీ అల్లర్లు జరుగుతున్నాయంటూ వదంతు లు వస్తున్నాయని, వీటిని ఏమా త్రం ఉపేక్షించవద్దని ఆయన కోరారు. పార్లమెంట్‌లో చర్చ జరిపి ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించి, ప్రజలకు పూర్తిభరోసా కల్పించాల్సిన అవసరం కేం ద్రంపై ఉన్నదన్నారు. 


logo