సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 03, 2020 , 13:23:43

నర్సరీని పరిశీలించిన నల్లగొండ జడ్పీసీఈఓ

నర్సరీని పరిశీలించిన నల్లగొండ జడ్పీసీఈఓ

నల్లగొండ : మాడ్గులపల్లి మండలం కుక్కడం గ్రామంలో నర్సరీని జడ్పీసీఈఓ వీరబ్రహ్మచారి బుధవారం పరిశీలించారు. వేసవి దృష్ట్యా మొక్కలు ఎండిపోకుండా నీరందించాలని వన సేవకులకు సూచించారు. వర్షాలు పడగానే నాటేందుకు మొక్కలను సిద్ధంగా ఉంచాలన్నారు. అనంతరం డంపింగ్‌ యార్డు, డ్రైనేజీలను పరిశీలించారు. పల్లె ప్రగతి పనుల త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట పలుశాఖల అధికారులున్నారు.


logo