ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 06, 2020 , 19:37:54

పారిశుధ్య మెరుగుకు ప్రాధాన్యం ఇవ్వాలి

పారిశుధ్య మెరుగుకు ప్రాధాన్యం ఇవ్వాలి

నల్లగొండ : నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పేరేపల్లి, నార్కట్‌పల్లి మండలం జువ్విగూడెం గ్రామాల్లో శనివారం కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ పర్యటించారు. గ్రామాల్లో కాలినడక తిరుగుతూ పల్లెప్రగతిలో భాగంగా చేపట్టిన పనులను పరిశీలించారు. డంపింగ్‌యార్డు, శ్మశానవాటిక, రహదారులను పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులకు సూచించారు. వీధుల వెంట ఇష్టానుసారంగా చెత్త వేయొద్దని, పంచాయతీ సిబ్బందికి అందించి సహకరించాలని కోరారు. సేకరించిన చెత్తను ఎప్పటికప్పుడు పంచాయతీ ట్రాక్టర్‌లో డంపింగ్‌ యార్డుకు తరలించాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. హరితహారం మొక్కలను పరిశీలించి, ఎండిపోకుండా నీరందించాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట పలువురు అధికారులున్నారు. 


logo