గురువారం 02 జూలై 2020
Telangana - Jun 04, 2020 , 17:03:02

పల్లె ప్రగతి పనులు త్వరగా పూర్తి చేయాలి

పల్లె ప్రగతి పనులు త్వరగా పూర్తి చేయాలి

నల్లగొండ : పల్లె ప్రగతి పనులను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌ సూచించారు.  గురువారం వేములపల్లి మండలం శెట్టిపాలెం, మిర్యాలగూడ మండలం యాద్గార్‌పల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావుతో కలిసి ఆయన పర్యటించి డ్రైనేజీలను, రహదారులను, శ్మశానవాటికను, డంపింగ్‌ యార్డును పరిశీలించారు. పారిశుధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. చెత్తను ఎప్పటికప్పుడు డంపింగ్‌ యార్డులకు తరలించేందుకు ప్రభుత్వం పంచాయతీకి ట్రాక్టర్‌ను కేటాయించిందని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ఎండిపోకుండా నీరందించాలని చెప్పారు. గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 


logo