శనివారం 11 జూలై 2020
Telangana - Jun 03, 2020 , 13:23:54

పారిశుధ్య పనులపై అధికారులు దృష్టిసారించాలి

పారిశుధ్య పనులపై అధికారులు దృష్టిసారించాలి

నల్లగొండ : రానున్న వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పారిశుధ్య పనులపై అధికారులు పూర్తిస్థాయిలో దృష్టిసారించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ సూచించారు. ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా బుధవారం అనుముల మండలం మదారిగూడెం, నిడమనూరు మండలం బంకాపురం గ్రామాల్లో నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యతో కలిసి ఆయన పర్యటించారు. కాలినడకన తిరుగుతూ పల్లెప్రగతిలో భాగంగా చేపట్టిన హరితహారం నర్సరీలను, విద్యుద్దీకరణ పనులు, రహదారులు, డ్రైనేజీలను పరిశీలించారు. నర్సరీల్లో మొక్కల సంరక్షణపై దృష్టిపెట్టాలని నిర్వాహకులకు సూచించారు. డ్రైనేజీలను శుభ్రం చేయాలని, వీధుల వెంట చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని పారిశుధ్య సిబ్బందిని ఆదేశించారు. పారిశుధ్య మెరుగుకు గ్రామస్తులంతా సహకరించాలని కోరారు. అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట డీపీఓ విష్ణువర్ధన్‌రెడ్డి, మిర్యాలగూడ ఆర్డీఓ రోహిత్‌ సింగ్‌, నిడమనూర్‌ తాసిల్దార్‌  ప్రమీల, ఎంపీడీఓ ప్రయోద్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.


logo