అమెరికాలో నల్లగొండవాసి దుర్మరణం

- పార్కుచేసిన కారులో మంటలతో టీఆర్ఎస్ అధికార ప్రతినిధి మృతి
- దేవరకొండ పట్టణంలో విషాదం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ/ దేవరకొండ: అమెరికాలో టీఆర్ఎస్ ఎన్నారై సెల్ అధికార ప్రతినిధి నల్లమాద దేవేందర్‌రెడ్డి (47) ప్రమాదవశాత్తు దుర్మరణం చెందారు. న్యూజెర్సీలోని ఎడిసన్‌లో ఉంటున్న ఆయన ఇంటి ఎదుట పార్కుచేసిన కారులో మంగళవారం ఒక్కసారిగా మంటలు చెలరేగి సజీవదహనమయ్యారు. నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన నల్లమాద నర్సిరెడ్డి, భారతమ్మ దంపతుల రెండో కుమారుడైన దేవేందర్‌రెడ్డి ఏడేండ్ల కిందట ఇంజినీరింగ్ పూర్తిచేసి అమెరికా వెళ్లారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ కుటుంబసభ్యులతో కలిసి అక్కడే స్థిరపడ్డాడు. మృతికి గల కారణాలను అమెరికా పోలీసులు ధ్రువీకరించాల్సి ఉన్నది. దేవేందర్‌రెడ్డికి భార్య అనురాధ, కూతురు ఉన్నారు. అతడి మృతితో దేవరకొండలో విషాదం నెలకొన్నది. దేవేందర్‌రెడ్డి మృతిపై టీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. విషయాన్ని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీఆర్ఎస్ ఎన్నారై సెల్ సలహాదారు, ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు.
బోయినపల్లి సంతాపం
దేవేందర్‌రెడ్డి మృతికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ సంతాపం వ్యక్తంచేశారు. అమెరికాలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి దేవేందర్‌రెడ్డి చేసిన సేవలను కొనియాడారు. బాధిత కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తాజావార్తలు
- ముఖ్యమంత్రికి కృతజ్ఞతలతో..
- ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం
- ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు
- కేటీఆర్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతారు
- సైదన్న జాతర సమాప్తం
- అవకాశమిస్తే.. కాదా! ఆకాశమే హద్దు
- సమన్వయంతో పని చేయాలి
- పాఠశాల పరిసరాలను శుభ్రం చేయాలి
- సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం
- తల్లీబిడ్డల సంక్షేమం కోసమే మాతా శిశు దవాఖాన