శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 22, 2020 , 08:51:24

నాయినికి జొన్నరొట్టే.. కోడి మాంసం అంటే భలే ఇష్టం

నాయినికి జొన్నరొట్టే.. కోడి మాంసం అంటే భలే ఇష్టం

హైదరాబాద్‌ : మాజీ హోంమంత్రి నాయిని న‌ర్సింహారెడ్డికి జొన్నరొట్టే, కోడి మాంసం అంటే భలే ఇష్టం. ఈ రెండింటి కాంబినేష‌న్ చిన్నప్పటి నుంచే ఆయ‌న‌కు అలవాటు. అది ఇప్పటి వ‌ర‌కూ కొన‌సాగింది. ఆదివారం వ‌చ్చిందంటే ఇంట్లో జొన్నరొట్టె, కోడి మాంసం వండాల్సిందే. ఈ వంట‌కాన్ని నాయిని అతి ఇష్టంగా తినేవారు. బేగంబ‌జార్ జిలేబీ అంటే మ‌హా ఇష్టం. ఇక పాత‌బ‌స్తీలోని బేగంబ‌జార్‌కు నాయినికి ఎంతో అనుబంధం ఉంది. సోష‌లిస్టు ఉద్యమాలు చేసిన స‌మ‌యంలో బిజీగా ఉన్నప్పుడు కాస్త సేద తీరేందుకు నాయిని త‌న స్నేహితుల‌తో క‌లిసి బేగంబ‌జార్ వెళ్లేవారు. అక్కడ వేడివేడిగా వేసే జిలేబీని తిని ఆయ‌న ఎంజాయ్ చేసేవాడు. ఇక ఒక గ్లాస్ పాలు తాగి తిరిగి ఇంటికి వ‌చ్చేవారు నాయిని. ‌


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.