ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Oct 22, 2020 , 08:58:26

1978 ఎన్నిక‌ల్లో అంజయ్యను ఓడించిన నాయిని

1978 ఎన్నిక‌ల్లో అంజయ్యను ఓడించిన నాయిని

హైద‌రాబాద్ : నాయిని న‌ర్సింహారెడ్డి తొలిసారిగా 1978 ఎన్నిక‌ల్లో అసెంబ్లీకి పోటీ చేశారు. ఆ ఎన్నిక‌ల్లో ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన నాయిని.. టంగుటూరి అంజయ్యను ఓడించారు. మూడు వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందిన నాయిని.. తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. తెలంగాణ ఉద్యమం తర్వాత 1975లో ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో సోష‌లిస్టు పార్టీ నాయ‌కులంద‌ర్నీ పోలీసులు అరెస్టు చేశారు. నాయినితో పాటు ప‌లువురిని 18 నెల‌ల పాటు చంచ‌ల్‌గూడ జైల్లో పెట్టారు. ఆ త‌ర్వాత 1978లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ‌న‌తా పార్టీ నుంచి తొలిసారిగా ముషీరాబాద్ నుంచి పోటీ చేసి అంజయ్యపై గెలిచారు. ఆ ఎన్నిక‌ల్లో నాయిని త‌న సొంతంగా ప‌దిహేను వేల రూపాయలతో పోటీ చేశాడు. సోష‌లిస్టు పార్టీ తరఫున 30వేలు పంపిస్తే ఆ డ‌బ్బుల‌తో ఎన్నిక‌ల ప్రచారం నిర్వహించి, గెలుపొందారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.