శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 22, 2020 , 11:57:24

నాయిని మరణం బాధాకరం : మంత్రి పువ్వాడ

నాయిని మరణం బాధాకరం : మంత్రి పువ్వాడ

ఖమ్మం : కార్మిక సంఘం నాయకుడిగా జీవితాన్ని ప్రారంభించిన టీఆర్‌ఎస్‌ సీనియర్ నాయకుడు, ఉద్యమ నేత నాయిని నర్సింహారెడ్డి మరణం అత్యంత బాధాకరమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  అన్నారు. గురువారం ఖమ్మం టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తొలి దశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆయన 2001లో నాటి ఉద్యమ సారధి, సీఎం కేసీఆర్‌ నాయకత్వానికి ఆకర్షితులైన తెలంగాణ సాధన కోసం మలి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని తెలిపారు.

పార్టీలో నాయిని నర్సింహారెడ్డికి కేసీఆర్  అన్ని వేళలా అత్యున్నత స్థానం కల్పించారని తెలిపారు. వారి మృతి పార్టీకి తీరని లోటన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాత మధు , మేయర్ పాపాలాల్, సుడా చైర్మన్ విజయ్ కుమార్, రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినటర్ నల్లమల వెంకటేశ్వరరావు, కార్పొరేటర్లు మురళి, ఊట్కూరి లక్ష్మీ సుజాత, నాయకులు ఉన్నారు.