గురువారం 09 జూలై 2020
Telangana - Dec 12, 2019 ,

గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న నైనా జైశ్వాల్..

గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న నైనా జైశ్వాల్..

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ నిర్విరామంగా కొనసాగుతోంది. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎందరో ప్రముఖులు గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలను నాటారు. తాజగా టేబుల్ టెన్నిస్ క్రీడా కారిణి నైనా జైస్వాల్.. గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించారు. హైదరాబాద్ ఎల్ బి స్టేడియంలో మొక్కలను నాటి మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ చేపట్టవల్సిందిగా సవాల్ విసిరారు. కార్యక్రమంలో శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా  సైనా జైశ్వాల్ మాట్లాడుతూ... మన పర్యావరణం పచ్చదనానికి చిహ్నము, ఐశ్వర్యానికి సంకేతము. ఇటువంటి మంచి కార్యక్రమమైన హరితహారానికి, పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వానికి నేను అభినందన తెలుపుతున్నాను. సూర్యుని రంగు ఎర్రదనం, చీకటి రంగు నల్లదనం, ప్రకృతి రంగు పచ్చదనం, కానీ మన సంతోష్ గారి రంగు మంచితనమని నేను చెప్పగలను అని కొనియాడారు. ఓటమిలో పాఠముంటుంది. గుణములో జ్ఞానముంటుంది. మంచిలో చెడు ఉంటుంది. మనసులో మారే శక్తి ఉంటుంది. ఆ శక్తిని మనము పర్యావరణ కల్యాణం కొరకు వాడుకోవాలి. అప్పుడే మానవ జన్మం పూలచందనంగా మారుతుందని తెలిపారు. 


logo