Telangana
- Jan 16, 2021 , 07:57:48
VIDEOS
నాగోబా జాతర రద్దు

యథావిధిగా సంప్రదాయ పూజలు
మెస్రం వంశీయుల తీర్మానం
ఇంద్రవెల్లి, జనవరి 15: ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్‌లో ఫిబ్రవరి 11 నుంచి 18 వరకు నిర్వహించే నాగోబా జాతరను రద్దు చేస్తూ మెస్రం వంశీయులు తీర్మానించారు. శుక్రవారం ఉమ్మడి జిల్లాలోని మెస్రం వంశీయులు నాగోబా ఆలయం(మురాడి)లో సమావేశమై పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా మెస్రం వంశీయుల పీఠాధిపతి వెంకట్రావ్పటేల్, పెద్దలు చిన్నుపటేల్ తీర్మాన వివరాలు వెల్లడించారు. కొవిడ్-19 నేపథ్యంలో కేవలం మెస్రం వంశీయుల సంప్రదాయ పూజలు, కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు. నాగోబాకు మెస్రం వంశీయులు నిర్వహించే మహాపూజలతోపాటు రోజువారీ కార్యక్రమాలు ఉంటాయని స్పష్టం చేశారు. జాతరతోపాటు ప్రజా దర్బార్‌ను కూడా రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు.
తాజావార్తలు
- ఇన్నోవేషన్ ఎక్స్‌ప్రెస్ 2021 అవార్డు అందుకున్న హైదరాబాదీ
- పనస పండు తింటే కలిగే లాభాలేంటి?
- డిజిటల్ పేమెంట్స్: దిగ్గజాల మధ్య పోటీ.. ఎవరెవరు ఎటువైపు?
- షుగర్ కంట్రోల్‌కు మెరుగైన ఆహారాలు..!
- పోలీసుల అదుపులో యూట్యూబ్ ఫేమ్ షణ్ముక్ జశ్వంత్
- ముగిసిన మేడారం మినీ జాతర
- రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ దేశానికే దిక్సూచి
- 120హెచ్జడ్ డిస్ప్లేతో రెడ్మి నోట్ 10 సిరీస్!
- అసోం ఎన్నికల్లో పోటీ చేస్తాం: తేజశ్వి యాదవ్
- ఇండియా, ఇంగ్లండ్ వన్డే సిరీస్.. ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ
MOST READ
TRENDING