గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Oct 18, 2020 , 09:43:31

నాగార్జునసాగర్‌ 18 క్రస్ట్‌గేట్లు 20 అడుగుల మేర ఎత్తివేత

నాగార్జునసాగర్‌ 18 క్రస్ట్‌గేట్లు 20 అడుగుల మేర ఎత్తివేత

నల్లగొండ : కృష్ణా నదికి వరద ప్రవాహాలు పోటెత్తుతున్నాయి. దీంతో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. అధికారులు ప్రాజెక్టు 18 క్రస్ట్‌గేట్లను 20 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. డ్యాంకు ఇన్‌ఫ్లో 5,38,467 క్యూసెక్కులు ఉండగా ఔట్‌ఫ్లో 5,38,467 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుతం 309.3558 టీఎంసీలు ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు ప్రస్తుతం 589.10 అడుగులుగా ఉంది.  మరోవైపు తుంగభద్ర జలాశయానికి వరద తగ్గుముఖం పడుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులతో కొనసాగుతుంది. పూర్తిస్థాయి నీటినిల్వ 100.855 టీఎంసీలు ఉంది. జలశయానికి వచ్చే ఇన్‌ఫ్లో 13519 క్యూసెక్కులను అంతే పరిమాణంలో ఔట్‌ఫ్లోగా దిగువకు వదులుతున్నారు.