గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 27, 2020 , 16:48:35

541 అడుగులకు నాగార్జున సాగర్ నీటిమట్టం

541 అడుగులకు నాగార్జున సాగర్  నీటిమట్టం

నల్లగొండ : నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు శ్రీశైలం నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ఉన్న శ్రీశైలం నుంచి 41 వేల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా వస్తున్నది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు  కాగా ప్రస్తుతం 541 అడుగుల నీటి మట్టానికి సాగర్ చేరుకున్నది. ఈ సీజన్ లో 529 ఆడుగుల కనిష్ఠ నీటి మట్టం నుంచి సాగర్ కు వరద ప్రవాహం మొదలైంది. ఇప్పటి వరకు 12 అడుగుల మేర నీరు పెరిగింది. మొత్తం  312 టీఎంసీల  పూర్తి నీటి నిల్వ సామర్థ్యానికి గానూ ప్రస్తుతం 190.416 టీఎంసీల నీరు  డ్యామ్ లో నిల్వ ఉన్నది. 

గతం కంటే భిన్నంగా ఈ సారి 20 రోజుల ముందుగానే సాగర్ కు ఇన్ ఫ్లో మొదలవ్వడంతో  తొందరగానే డ్యామ్ గరిష్ఠ నీటి మట్టానికి  చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాగర్ లో జలకళ సంతరించుకోవడంతో ఆయకట్టు రైతుల్లో ఆనందం వెల్లివిరిస్తున్నది. మరి కొద్ది రోజుల్లో  ఎడమ కాల్వ ఆయకట్టుకు సాగునీటిని ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉండటంతో రైతన్నలు జోరుగా సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. logo