నల్లగొండ : నాగార్జునసాగర్ నాలుగు క్రస్ట్ గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి 31,140 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలౌతుంది. సాగర్ జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 587 అడుగులుగా ఉంది. డ్యాం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 305.50 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1,40,056 క్యూసెక్కులు కొనసాగుతుండగా ఔట్‌ఫ్లో 68,041 క్యూసెక్కులుగా ఉంది.