ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Aug 07, 2020 , 08:27:32

నాగార్జున సాగర్‌ @ 224టీఎంసీలు

నాగార్జున సాగర్‌ @  224టీఎంసీలు

నల్గొండ : నాగార్జునసాగర్‌లో నీటి నిల్వ 224కు టీఎంసీలకు చేరింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టుల గేట్లు ఎత్తడం దిగువకు భారీగా నీరు వస్తున్నది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 42,378 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, దిగువకు 10,622 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 552.60 అడుగులు కాగా, ప్రస్తుతం 556.60 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా, ప్రాజెక్టులో 224.32 టీఎంసీల నీరుంది. కృష్ణా నది ఎగువ గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ప్రాజెక్టులు నిండిపోయాయి. ఆల్మట్టి, నారాయణపురం నిండడంతో జూరాల మీదుగా జలాలు శ్రీశైలం రిజర్వాయర్‌కు చేరాయి. అక్కడి నుంచి జల విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌కు చేరుతోంది. వర్షాలు ఇలాగే కొనసాగితే ప్రాజెక్టుకు ఎక్కువగా వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టు జలకళను సంతరించుకుండడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo