ఆదివారం 06 డిసెంబర్ 2020
Telangana - Nov 04, 2020 , 02:26:16

భూమి కోసం బాలుడి పాదయాత్ర

భూమి కోసం బాలుడి పాదయాత్ర

వేములవాడ: తల్లిదండ్రులను కోల్పోయిన ఏడేండ్ల బాలుడు.. తమ భూమిని ఇప్పించి న్యాయంచేయాలని మంగళవారం వేములవాడ తాసిల్‌ కార్యాలయం నుంచి సిరిసిల్ల కలెక్టరేట్‌ వరకు పాదయాత్ర చేశాడు. వేములవాడ రూరల్‌ మండలం లింగంపల్లిలోని 1.08 ఎకరాల భూమి తన తల్లి నుంచి వారసత్వంగా వచ్చిందని, దాన్ని కబ్జా చేశారంటూ తాత రాజయ్యతో కలిసి నాగప్రణీత్‌  పలుమార్లు రెవెన్యూ అధికారులకు మొరపెట్టుకున్నాడు. అయినా న్యాయం జరగకపోవడంతో తాత, తన తండ్రి శిష్యులతో కలిసి పాదయాత్ర చేశాడు. దీనిపై రూరల్‌ తాసిల్దార్‌ నక్క శ్రీనివాస్‌ను సంప్రదించగా.. అది ప్రభుత్వ భూమిగా సమాచారం ఉందని, క్షేత్రస్థాయిలో పరిశీలించి న్యాయం చేస్తామన్నారు.