శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Oct 31, 2020 , 10:31:49

వ‌రంగ‌ల్ అర్బ‌న్ క‌లెక్ట‌ర్‌, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌కు కేటీఆర్ అభినంద‌న‌

వ‌రంగ‌ల్ అర్బ‌న్ క‌లెక్ట‌ర్‌, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌కు కేటీఆర్ అభినంద‌న‌

హైద‌రాబాద్ : వ‌రంగ‌ల్ అర్బ‌న్ క‌లెక్ట‌ర్, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌కు ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ అభినంద‌న‌లు తెలిపారు. వ‌రంగ‌ల్ ప‌ట్ట‌ణంలో నాలాలు, డ్రైన్ల‌కు ఉన్న అడ్డంకులు తొల‌గించేందుకు బాగా ప‌ని చేశార‌ని కొనియాడారు. హైద‌రాబాద్‌తో పాటు ఇత‌ర ప‌ట్ట‌ణాల్లోనూ ఇదే వ్యూహాన్ని అనుస‌రించాల‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు. 

కొద్ది రోజుల‌ క్రితం వ‌రంగ‌ల్ అర్బ‌న్‌ జిల్లాలో కురిసిన భారీ వ‌ర్షాల‌కు ప‌లు కాల‌నీలు నీట మునిగిపోయిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో నాడు పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ వ‌రంగ‌ల్ ప‌ట్ట‌ణాన్ని ప‌రిశీలించారు. నాలాలు, డ్రైన్ల‌పై నిర్మించిన అక్ర‌మ నిర్మాణాల‌ను తొల‌గించాల‌ని క‌లెక్ట‌ర్‌ను, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ల‌ను ఆదేశించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేర‌కు అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టారు. వ‌రంగ‌ల్ ప‌ట్ట‌ణంలో మొత్తం 384 అక్ర‌మ‌ నిర్మాణాలను గుర్తించారు. వీటిలో 288 అక్ర‌మ నిర్మాణాల‌ను కూల్చివేశారు. మ‌రో 96 నిర్మాణాలు కోర్టు స్టేతో పెండింగ్‌లో ఉన్నాయి.