బుధవారం 03 జూన్ 2020
Telangana - May 12, 2020 , 13:04:19

స్థానిక ఎమ్మెల్యేగా నా లక్ష్యం ఇదే : మంత్రి కేటీఆర్‌

స్థానిక ఎమ్మెల్యేగా నా లక్ష్యం ఇదే : మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ : సిరిసిల్లకు చెందిన ప్రతిభావంతమైన నేత సోదర, సోదరీమణులను చూసి గర్విస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ అన్నారు. సిరిసిల్ల నేత కార్మికులు బతుకమ్మ చీరల ఉత్పత్తి తయారీని తిరిగి ప్రారంభించారు. దీనిపై మంత్రి ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ... సిరిసిల్ల నేతను గుర్తించే బ్రాండ్‌గా చేయడమే స్థానిక ఎమ్మెల్యేగా తన లక్ష్యమన్నారు. టెక్స్‌టైల్‌ పార్క్‌, అపెరల్‌ పార్క్‌ ఈ లక్ష్య సాధనలో కీలకపాత్ర పోషించనున్నట్లు కేటీఆర్‌ తెలిపారు.


logo