ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Telangana - Jan 15, 2021 , 18:47:31

ప్రణాళికా బద్దంగా పని చేయాలి : వినోద్ కుమార్

ప్రణాళికా బద్దంగా పని చేయాలి : వినోద్ కుమార్

హైదరాబాద్‌ : ప్రణాళికా బద్దంగా పని చేసి ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం అర్థ గణాంక, ప్రణాళికా శాఖ అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు వినోద్ కుమార్‌తో మంత్రుల నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్‌కు పలు అంశాలపై వారు వినతి పత్రాన్ని అందజేశారు. గ్రామ, మండలం నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ శాఖల గణాంక వివరాలను పక్కాగా సేకరించాలని వినోద్ కుమార్ సూచించారు.

వివిధ ప్రభుత్వ శాఖలు అమలు చేసే పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఈ గణాంకాలు దిక్సూచిగా ఉపయోగపడేలా ఉండాలని ఆయన అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని క్షేత్ర స్థాయి గణాంకాలతో అట్లాస్ విడుదల అయిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరింత సమగ్ర సమాచారంతో 2021 వార్షిక గణాంక అట్లాస్‌ను రూపొందించేందుకు దృష్టిని సారించాలని ఆయన సూచించారు.

శాఖా పరంగా ఉన్న పలు అంశాలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన హామీనిచ్చారు. సమావేశంలో అర్థ గణాంక, ప్రణాళికా శాఖ జేఏసీ చైర్మన్ కే. వెంకటేశ్వర్లు, సెక్రెటరీ జనరల్ బీ. వేణు మాధవ్, సెక్రెటరీ రాజోజు నర్సింహా చారి, వైస్ ప్రెసిడెంట్ డీ. శివ కుమార్, హరికృష్ణ, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

పల్లెకు పుట్టినరోజు..పరవశంలో గ్రామస్తులు

‘అక్షరయాన్’ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత

టీకా ఎవ‌రు తీసుకోవాలి.. ఎవ‌రు తీసుకోవ‌ద్దు ? 

క‌వ్వాల్ అభ‌యార‌ణ్యంలో మంత్రి అల్లోల‌ 

మంటల్లో పడి వృద్ధురాలి సజీవదహనం 

VIDEOS

logo