శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Oct 02, 2020 , 13:04:56

వ‌ల‌స‌లు తగ్గిప్పుడే గ్రామ స్వ‌రాజ్యం సాధ్యం: మ‌ంత్రి ఎర్ర‌బెల్లి

వ‌ల‌స‌లు తగ్గిప్పుడే గ్రామ స్వ‌రాజ్యం సాధ్యం: మ‌ంత్రి ఎర్ర‌బెల్లి

హైద‌రాబాద్‌: సత్యం, అహింసా మార్గాల్లో దేనినైనా సాధించ‌గ‌ల‌మ‌ని నిరూపించిన వ్యక్తిగా మ‌హాత్మా గాంధీ చరిత్రలో ఎప్ప‌టికి నిలిచిపోతార‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలని మ‌హాత్ముడు నిరంత‌రం కోరుకునేవార‌ని చెప్పారు. గాంధీజీ 151వ‌ జ‌యంతి సంద‌ర్భంగా జాతిపిత‌కు ఘ‌నంగా నివాళుల‌ర్పించారు.   

గ్రామాల్లో వలసలు తగ్గినప్పుడే గాంధీజీ కలలుగ‌న్న గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుంద‌ని చెప్పారు. మహాత్ముని మాట‌ల‌కు అనుగుణంగా సీఎం కేసిఆర్ గ్రామాలను అభివృద్ది చేస్తున్నారన్నారు. రైతులకు నూతన రెవెన్యూ చట్టం, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలతో రైతుల కష్టాలు తీరుస్తున్నార‌ని వెల్ల‌డించారు. 

అహింసా, సత్యాగ్రహం అనే ఆయుధాలతో సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి  గాంధీజీ పశ్చిమాన్ని చూపించార‌ని మంత్రి పువ్వాడ అజ‌య్ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా  ఖ‌మ్మంలోని గాంధీ చౌక్‌లో బాపూజీ విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. మ‌హాత్ముడు చూపిన మార్గం అందరికీ అనుసరణీయమని చెప్పారు.