సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Jul 19, 2020 , 19:57:21

పకడ్బందీ జాగ్రత్తలతో కంటైన్మెంట్ ప్రాంతాలకు వెళ్లాలి

పకడ్బందీ జాగ్రత్తలతో కంటైన్మెంట్ ప్రాంతాలకు వెళ్లాలి

మహబూబ్ నగర్ :  కంటైన్మెంట్‌ ప్రాంతాలకు వెళ్లే ముఖ్యమైన వర్కర్లందరూ కరోనా వైరస్ సోకకుండా పూర్తి రక్షణ ఏర్పాట్లతో వెళ్లాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని  టీచర్స్ కాలనీ, మర్లు, క్రిస్టియన్ పల్లిలో ఏర్పాటు చేసిన  కంటైన్మెంట్  జోన్లను పరిశీలించారు. సౌకర్యాలు, పాజిటివ్ వచ్చిన వారికి అందుతున్న వైద్యసేవలు, ఇతర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు, వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. 

కంటైన్ మెంట్ జోన్లలో పని చేసే వారు మాస్కులు, ఫేస్ షీల్డ్స్, గ్లౌజులు అన్ని వేసుకున్న తర్వాత పూర్తి రక్షణగా కంటెంట్మెంట్ ప్రాంతాలకు వెళ్లాలని ఆయన ఆదేశించారు. కలెక్టర్  వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కృష్ణ, 104 వాహనాల జిల్లా కోఆర్డినేటర్ వేణుగోపాల్ రెడ్డి, సీఐ  హనుమప్ప, తాసిల్దార్ పార్థసారథి, డాక్టర్ రఫీ, ఆయా ప్రాంతాలలోని వైద్య బృందాలు, ఇతర టాస్క్ఫోర్స్ బృందాలున్నాయి.logo