శనివారం 29 ఫిబ్రవరి 2020
కోర్టు ఆదేశాలపై అప్రమత్తంగా ఉండాలి..

కోర్టు ఆదేశాలపై అప్రమత్తంగా ఉండాలి..

Feb 15, 2020 , 07:42:34
PRINT
కోర్టు ఆదేశాలపై అప్రమత్తంగా ఉండాలి..

హైదరాబాద్: కోర్టు ఆదేశాలు, కేసులపై ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని హెచ్‌ఎండీఏ సెక్రటరీ కె.రాంకిషన్‌ స్పష్టం చేశారు. మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అర్వింద్‌కుమార్‌ ఆదేశాల మేరకు శుక్రవారం తార్నాకలోని హెచ్‌ఎండీఏ ప్రధానకార్యాలయంలో ఉద్యోగులకు లీగల్‌ అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి రాంకిషన్‌ మాట్లాడుతూ.. కోర్టులో పిటీషన్‌ పడిన వెంటనే స్టాండింగ్‌ కౌన్సిల్‌కు సమాచారం తెలుస్తుందని, కోర్టు పిటీషన్లకు 90రోజుల్లోగా స్పందించని పక్షంలోనే వివాదం ముదురుతుందని వివరించారు. కోర్టు ఇచ్చిన టైమ్‌ షెడ్యూల్‌ను తప్పనిసరిగా ఫాలో కావాలని సూచించారు. నోటీసులను కేవలం స్పీడ్‌పోస్టు, రిజిస్టర్‌ పోస్టు ద్వారా పంపించిన వాటి తాలూకు వివరాలను భద్రపరచాలని తెలిపారు. ఔటర్‌ ప్రాజెక్టు, కోకాపేట ల్యాండ్‌ కేసుల్లో హెచ్‌ఎండీఏకు అనుకూలంగా తీర్పులు రావడానికి మన వద్ద ఉన్న రికార్డులను సరైన సమయంలో న్యాయస్థానాల దృష్టికి తీసుకురావడం వల్లే సాధ్యమైందని చెప్పారు. కార్యక్రమంలో ప్లానింగ్‌ డైరెక్టర్‌ కె.శ్రీనివాస్‌, జి. నరేంద్ర, ఇన్‌చార్జి చీఫ్‌ఇంజినీర్‌ మహ్మద్‌ మాజీద్‌ షరీఫ్‌, ఎస్‌ఈ షేక్‌ ముజఫర్‌ ఇమామ్‌, సీహెచ్‌ పరంజ్యోతి తదితరులు పాల్గొన్నారు.


logo