శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 19, 2020 , 12:31:26

కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి: సిద్దిపేట సీపీ

కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి: సిద్దిపేట సీపీ

సిద్దిపేట: ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌(కోవిద్‌-19) పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ డి.జోయల్‌ డేవిస్‌ తెలిపారు. కరోనా వ్యాధి గురించి పోలీసు అధికారులకు, జిల్లా ఉన్నతాధికారులకు, ప్రజలకు ఆయన సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా సూచనలు చేశారు. 

కమిషనర్‌ చేసిన సూచనలు:

* విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల దగ్గరికి వెళ్లే సమయంలో మాస్కులు ధరించాలనీ, శానిటైజర్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. 

* ప్రతి పోలీస్‌ స్టేషన్‌ ముందు భాగంలో నీళ్లు, హ్యాండ్‌వాష్‌ సబ్బులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. 

* శ్వాసకోశ వ్యాధులున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, కరోనా వ్యాధి ప్రబలకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, ఆరోగ్య సూత్రాలు పాటించాలన్నారు. 

* బ్లూ కోట్స్‌, పెట్రోలింగ్‌ సిబ్బంది, రిసెప్షన్‌, లా అండ్‌ ఆర్డర్‌ విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది ప్రజల్లోకి వెళ్లేటప్పుడు తప్పకుండా మాస్కులు ధరించాలని సీపీ సూచించారు. 

* ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో టెంపరేచర్‌ ఎలక్ట్రానిక్‌ మిషన్‌, మాస్కులు, హ్యాండ్‌ శానిటైజర్లు వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 

* సబ్‌ డివిజన్‌ స్ధాయిలో ఆర్డీవో, ఏసీపీ, మెడికల్‌ ఆఫీసర్‌.. కరోనా వ్యాధి నివారణ నోడల్‌ అధికారులుగా పనిచేస్తున్నారని సీపీ తెలిపారు. 

* మండల స్థాయిలో ఎమ్మార్వో, ఎంపీడీవో, సీఐలు, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు వ్యాధి నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. 

* సిద్దిపేటలో ఉన్న మెడికల్‌ షాప్స్‌, మెడికల్‌ ఏజెన్సీలకు సంబంధిత సీఐలు, ఎస్‌ఐలు రెండు రోజుల క్రితం నుంచే అవగాహన కల్పించారనీ, మాస్కులు, శానిటైజర్లు అధిక ధరకు విక్రయిస్తే చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. 

* సోషల్‌ మీడియాలో కరోనా వ్యాధిపై తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని ఈ సందర్భంగా సీపీ సూచించారు. ముఖ్యంగా వాట్సాప్‌ గ్రూపుల్లో తప్పుడు సమాచారం పంపిస్తే.. ఆ వ్యక్తిపై, సదరు గ్రూపు అడ్మిన్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

* కరోనా వ్యాధి గురించి ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కాకూడదని, వ్యాధి లక్షణాలున్నైట్లెతే, ఇంటిని వదిలి బయటకు రావొద్దని.. వారిని సిబ్బంది సాయంతో తక్షణమే ఐసోలేషన్‌ సెంటర్లకు పంపిస్తామని ఆయన వివరించారు. 

* బయటకు వెళ్లేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరితోనూ దగ్గరగా ఉండి మాట్లాడకూడదని, కరచాలనం చేయకూడదని ఈ సందర్భంగా సీపీ జోయల్‌ సూచించారు. 

సెల్‌ కాన్ఫరెన్స్‌లో అడిషనల్‌ డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 


logo