గురువారం 09 జూలై 2020
Telangana - Jun 13, 2020 , 03:40:18

విద్యార్థులను దత్తత తీసుకోవాలి

విద్యార్థులను దత్తత తీసుకోవాలి

  • రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: బాలలు కార్మికులుగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉన్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపా ధ్యక్షుడు బీ వినోద్ అన్నారు. శుక్రవారం ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎంవీ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన జూమ్ సమావేశంలో ఆయన మాట్లాడారు. బాల కార్మికుల సమస్యను అధిగమించడానికి విద్యావంతులైన యువత ఒక్కో విద్యార్థిని దత్తత తీసుకుని విద్యాబుద్ధులను నేర్పించాలని పిలుపునిచ్చారు. పిల్లలకు చదువు చెప్పేందుకు టీచర్లు ప్రతిరోజు ఒకటిరెండుగంటలు కేటాయించాలని కోరారు. ప్రతి స్థానిక సంస్థ నియోజకవర్గంలోని పిల్లలకు కోసం రిజిస్టర్ నిర్వహించాలని, వారి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. 

దోహా, ఖతార్ నుంచి విమానాలు పెంచండి

గల్ఫ్ చిక్కుకున్న తెలంగాణవాసులను స్వగ్రామాలకు రప్పించేందుకు దోహా, ఖతార్ నుంచి హైదరాబాద్ విమానాల సంఖ్యను పెంచాలని వినోద్ విదేశాంగశాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ కోరారు.  ఈ మేరకు శుక్రవారం ఆయనకు లేఖ రాశారు.  తెలంగాణ గల్ఫ్ సమితి,  ప్రజాసంఘాల సమితి, ఖతార్ తె లంగాణ జాగృతి సంస్థల ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు వినోద్ స్పందించారు.  


logo