శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Sep 27, 2020 , 12:53:36

దుర్గంచెరువు తీగల వంతెనపై సంగీత ప్రద్శరన

దుర్గంచెరువు తీగల వంతెనపై సంగీత ప్రద్శరన

హైదరాబాద్‌ : దుర్గంచెరువు తీగల వంతెనపై ఆదివారం మాత్రమే సందర్శకులకు అనుమతి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. వంతెనపై ఇవాళ సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు సంగీత ప్రదర్శన ఉంటుందని తెలిపారు. ఇండియన్‌ ఆర్మీ ఆధ్వర్యంలో సింఫోన్‌ బ్యాండ్‌ పదర్శన ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సైనికులు, కరోనా వారియర్లు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది సేవలకు సంఘీభావంగా బ్యాండ్‌ ప్రదర్శన ఏర్పాటు చేశారు. 45 నిమిషాలపాటు సాగే ప్రదర్శనకు అందరికీ ఉచిత ప్రవేశం కల్పించారు. ప్రదర్శనలో దేశభక్తి గీతాలతోపాటు సంప్రదాయ, పాశ్చాత్య పాటల ప్రదర్శన ఉంటుంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo