మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 12, 2020 , 00:57:43

అమీర్‌పేటలో దారుణ హత్య

అమీర్‌పేటలో దారుణ హత్య

  • సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను చంపిన ఆగంతకులు
  • కత్తిపోట్లతో అక్కడికక్కడే మృతి
  • చంపింది భార్య తరఫు బంధువులే!

వెంగళరావునగర్‌: హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దారుణహత్యకు గురయ్యాడు. ఆదివారం ఉద యం అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో కాపుకాసిన ఆగంతకులు.. యువకుడిని కత్తులతో పొడిచి చంపారు. మృతుడి భార్య తరఫు బంధువులే ఈ హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎస్సార్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ కే సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన కేశన చంద్రశేఖర్‌రాజు (26) కు కృష్ణాజిల్లా మచిలీపట్నంకు చెందిన లక్ష్మీగౌరి(22)తో గతేడాది ఫిబ్రవరిలో వివాహమైంది. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయిన చంద్రశేఖర్‌రాజు.. భార్యతో కలిసి జగద్గిరిగుట్టలోని ఆల్విన్‌కాలనీలో నివాసం ఉన్నాడు. 

లక్ష్మీగౌరి గత జూన్‌ ఒకటిన ఇం ట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అదనపు కట్నం కోసం భర్త, అతడి తల్లిదండ్రులు వేధించడం వల్లే లక్ష్మీగౌరి ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆమె కుటుంబసభ్యులు జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. నిందితులపై కేసు నమోదుచేసిన పోలీసులు వారిని జైలు పంపారు. ఇటీవలే బెయిల్‌పై చంద్రశేఖర్‌రాజు విడుదలయ్యాడు. అతడు ప్రతీవారం బాలానగర్‌ ఏసీపీ కార్యాలయానికి వెళ్లి సంతకం పెట్టాల్సి ఉన్నది. దీంతో అమీర్‌పేటలోని ధరమ్‌కరమ్‌ రోడ్డులోని పద్మశ్రీ అపార్ట్‌మెంట్స్‌లో తన మేనమామ ఇంట్లో 40 రోజులుగా తల్లి, సోదరుడితో కలిసి చంద్రశేఖర్‌రాజు ఉంటున్నాడు. 

వారంరోజులుగా అతడి కదలికలపై ఆగంతకులు నిఘాపెట్టారు. ఆదివారం ఉదయం 9.30 గంటలకు చికెన్‌ కోసం బయటకు వెళ్లొచ్చిన చంద్రశేఖర్‌రాజును.. అప్పటికే అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో కాపుకాసిన దుండగులు ఒక్కసారిగా కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. తీవ్ర గాయాలతో రక్తస్రావమై చంద్రశేఖర్‌రాజు అక్కడికక్కడే మృతిచెందాడు. చనిపోయినట్టు నిర్ధారించుకున్న ఆగంతకులు అక్కడి నుంచి పరారయ్యారు. హత్యను ప్రత్యక్షంగా చూసిన స్థానికులు ఎస్సార్‌నగర్‌ పోలీసులకు సమాచారమి చ్చారు. ఘటనాస్థలానికి పోలీస్‌ అధికారు లు చేరుకొని ఆధారాలు సేకరించారు. చం ద్రశేఖర్‌రాజును అతడి భార్య బంధువులే హత్యచేసినట్టు అనుమానిస్తున్నారు. logo