ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 09, 2020 , 22:03:00

హత్యచేసి సెల్ఫీ..

హత్యచేసి సెల్ఫీ..

ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్‌ జిల్లాలో చిన్నాన్నను హత్య చేసిన యువకుడు మృతదేహంతో సెల్ఫీ దిగిన ఫొటోలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఉట్నూరు మండలం లక్కారం గ్రామానికి చెందిన రిటైర్డ్‌ ఏఎస్సై శివరాజ్‌కు ఆయన తమ్ముడి కుటుంబానికి ఈ నెల 6న ఆస్తి విషయంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో శివరాజ్‌పై ఆయన తమ్ముడి కొడుకులు కర్రలతో దాడిచేయగా ఆయన తీవ్ర గాయాలతో మృతి చెందాడు. ఈ ఘటనలో నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. దాడి చేసిన వివేక్‌.. విగతజీవిగా పడిఉన్న పెదనాన్నతో సెల్ఫీదిగిన ఫొటోలు సోషల్‌ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చాయి.logo