సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 10, 2020 , 02:00:18

పెదనాన్న హత్య.. ఆపై సెల్ఫీ

పెదనాన్న హత్య.. ఆపై సెల్ఫీ
  • ఆదిలాబాద్‌ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి..

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తేతెలంగాణ: ఆదిలాబాద్‌ జిల్లాలో ఓ యువకుడు పెదనాన్నను హత్య చేసి.. ఆ మృతదేహంతో సెల్ఫీ దిగిన ఫొటోలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఉట్నూరు మండలం లక్కారం గ్రామానికి చెందిన రిటైర్డ్‌ ఏఎస్సై శివరాజ్‌కు ఆయన తమ్ముడి కుటుంబానికి ఈనెల 6న ఆస్తి విషయంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో శివరాజ్‌పై ఆయన తమ్ముడి కొడుకులు కర్రలతో దాడిచేయగా ఆయన తీవ్రగాయాలతో మృతి చెందాడు. ఈ ఘటనలో నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. దాడి చేసిన అనంతరం సంఘటన స్థలంలోనే పెదనాన్న మృతదేహంతో వివేక్‌ సెల్ఫీదిగిన ఫొటోలు సోషల్‌ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చాయి. 


logo