సోమవారం 28 సెప్టెంబర్ 2020
Telangana - Aug 08, 2020 , 02:28:38

మున్సిఫ్‌ ఎడిటర్‌ లతీఫ్‌ఖాన్‌ కన్నుమూత

మున్సిఫ్‌ ఎడిటర్‌ లతీఫ్‌ఖాన్‌ కన్నుమూత

  • అమెరికాలోనే అంత్యక్రియలు.. సీఎం కేసీఆర్‌ సంతాపం 

మీర్‌చౌక్‌, నమస్తేతెలంగాణ: హైదరాబాద్‌ కేంద్రంగా వెలువడుతున్న ప్రముఖ ఉర్దూ దినపత్రిక మున్సిఫ్‌ ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ లతీఫ్‌ మహ్మద్‌ఖాన్‌(87) అమెరికాలోని షికాగోలో కన్నుమూశారు. 15 రోజుల కిందట అమెరికా వెళ్లిన ఆయన తనపుట్టిన రోజైన ఆగస్టు6నే మృతిచెందడం పలువురిని దిగ్భ్రాంతికి గురిచేసింది. లతీఫ్‌మహమ్మద్‌ఖాన్‌కు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. శుక్రవారం మధ్యాహ్నం షికాగోలోని ముస్లిం కమ్యూనిటీ సెంటర్‌లో ప్రార్థనల అనంతరం ఖననం చేస్తారని సమాచారం. మున్సిఫ్‌ ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ లతీఫ్‌మహ్మద్‌ఖాన్‌ మృతి పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. హైదరాబాద్‌ నగరం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందని పాత్రికేయులు, సాహితీవేత్తలు విచారం వ్యక్తం చేశారు. లతీఫ్‌మహ్మద్‌ఖాన్‌ పేద ముస్లింలకు విద్యను అందించేందుకు  విద్యాసంస్థలను స్థాపించారని గుర్తుచేసుకున్నారు.  


logo