కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయాడు కన్నడ యాక్టర్ యశ్. ఇపుడు ఈ యాక్టర్ మరోసారి కేజీఎఫ్ చాప్టర్ 2తో ఎంటర్టైన్ చేయడానికి రాబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు అద్బుతమైన స్పందన వచ్చింది. హిందీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు స్పెషల్ ఇవ్వబోతున్నాడట యశ్. ఇంతకీ ఆ ట్రీట్ ఏంటీ అనుకుంటున్నారా..? హఙఃహిందీ వెర్షన్ లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలని ఫిక్సయ్యాడట.
యశ్ తీసుకున్న ఈ నిర్ణయం అతన్ని హిందీ ఫ్యాన్స్ కు మరింత దగ్గర చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు ఈ అప్డేట్ సినిమాలపై అంచనాలను కూడా పెంచేస్తుంది. కేజీఎఫ్ చాప్టర్ 2లో బాలీవుడ్ నటులు సంజయ్‌దత్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంజయ్‌దత్ అధీరా పాత్ర లుక్కు మంచి స్పందన వస్తోంది. త్వరలోనే హిందీ వెర్షన్ కు ప్రమోషన్స్ మొదలు పెట్టబోతున్నారట యశ్ అండ్ ప్రశాంత్ నీల్ టీం.