ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Oct 23, 2020 , 01:31:17

ఏసీబీకి చిక్కిన మున్సిపల్‌ కమిషనర్‌

ఏసీబీకి చిక్కిన మున్సిపల్‌ కమిషనర్‌

మహబూబ్‌నగర్‌ క్రైం: క్లోరినేషన్‌ ప్లాంట్‌ అనుమతి కోసం రూ.1.65 లక్షల లంచం తీసుకుంటూ పాలమూరు మున్సిపల్‌ కమిషనర్‌ వడ్డె సురేందర్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.ఏసీబీ డీఎస్పీ కృష్ణాగౌడ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌కు చెందిన కాంట్రాక్టర్‌ సయ్యద్‌అలీ అహ్మద్‌ఖాన్‌ క్లోరినేషన్‌ ప్లాంట్‌ ఏర్పాటుకోసం కమిషనర్‌ను కలువగా అనుమతికి రూ.1.65 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. గురువారం మున్సిపల్‌ కార్యాలయంలో ఆ మొత్తాన్ని కాంట్రాక్టర్‌ నుంచి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నగదు స్వాధీనం చేసుకుని కమిషనర్‌ను అదుపులోకి తీసుకున్నారు.