శనివారం 30 మే 2020
Telangana - May 21, 2020 , 09:57:23

లాభసాటి వ్యవసాయానికి తాముసైతం అంటున్న ముఖ్రా కె

లాభసాటి వ్యవసాయానికి తాముసైతం అంటున్న ముఖ్రా కె

ఆదిలాబాద్‌ : సీఎం కేసీఆర్‌ ప్రతిపాదించిన నియంత్రిత సేద్యానికి రాష్ట్ర అన్నదాతల నుంచి మద్దతు వెల్లువెత్తుతుంది. రాష్ట్రంలో తొలిసారిగా జగిత్యాల జిల్లాలోని గాదెపల్లి రైతాంగం సీఎం కేసీఆర్‌ మాట ప్రకారమే పంటల సాగుచేస్తామని బుధవారం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. వీరి బాటలో తాజాగా ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ముఖ్రా కె గ్రామ రైతులు పయనిస్తున్నారు. సీఎం చెప్పిన విధంగా పంటలు వేస్తామని.. రైతుల లాభసాటి వ్యవసాయం కోసం తాము సైతం నడుస్తామంటున్నారు. ఈ మేరకు గ్రామ రైతులందరూ సర్పంచ్‌ గాడ్గే మీనాక్షి ఆధ్వర్యంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గాడ్గే సుభాష్‌, తిరుపతి, సంజీవ్‌, తదితరులు పాల్గొన్నారు.


logo