గురువారం 09 జూలై 2020
Telangana - Jun 05, 2020 , 20:17:45

పల్లెల్లో ఎంతో మార్పు : సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

పల్లెల్లో ఎంతో మార్పు : సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

వికారాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రతీ పల్లెల్లో ఎంతో మార్పు వచ్చిందని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం వికారబాద్‌ మండలం పెండ్లిమడుగు, నవాబుపేట్‌ మండలం దాతాపూర్‌ గ్రామపంచాయతీల్లో నర్సరీలను, వైకుంఠదామాలను పంచాయతీరాజ్‌ కమిషనర్‌ రఘునందన్‌ రావుతో కలిసి సీఎస్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా సోమేశ్‌కుమార్‌ మాట్లాడుతూ... రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ప్రతీ గ్రామంలో ట్రాక్టర్‌, వైకుంఠదామం, డంపింగ్‌యాడర్డు, తడి-పొడి చెత్త సేకరణ జరుగుతుందన్నారు. హరితహారం కార్యక్రమంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించిందన్నారు. ఈ ఏడాది పెద్దఎత్తున మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించిందన్నారు. అగ్రో ఫారెస్ట్రీని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. 


logo