న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌కు ఆ సంస్థ ఓ మహిళా ఉద్యోగితో రోమాంటిక్ అఫైర్‌పై సీఈవో సత్య నాదెళ్ల స్పందించారు. తనతో సహా అందరికీ 2000తో పోలిస్తే 2021లో మైక్రోసాఫ్ట్ విభిన్నమైందని సీఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
ప్రతిరోజూ సంస్థలో సానుకూలంగా పని చేసేందుకు అనువైన వాతావరణం తాము కల్పించామని సత్య నాదెళ్ల చెప్పారు. వైవిధ్యభరితమైన సంస్కృతిని మెరుగు పరిచేందుకు క్రుషి చేస్తున్నామని, దానిపైనే తాను ద్రుష్టి పెట్టామన్నారు.
సంస్థ ఉద్యోగులంతా సౌకర్యవంతంగా పనిచేయడంతోపాటు వారి సమస్యలు లేవనెత్తేందుకు అనుమతి ఇస్తున్నామని సత్య నాదెళ్ల అన్నారు. ఉద్యోగులు చేసే ఫిర్యాదులపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయగల సామర్థ్యం తమ సంస్థకు ఉందన్నారు.
ఏ ఒక్కరూ సమస్య లేవనెత్తినా.. ఆ సమస్య 20 ఏండ్ల నాటిదైనా.. మేం దర్యాప్తు చేస్తాం.. సమస్య బహిర్గతం చేసిన వ్యక్తికి సంతృప్తి కలిగించే చర్య తీసుకుంటామని చెప్పారు. అయితే, బిల్‌గేట్స్‌కు, సంస్థలోని మహిళా ఉద్యోగికి మధ్య వివాదంపై సత్య నాదెళ్ల స్పందించడం ఇదే తొలిసారి.
రెండేండ్ల క్రితం బిల్‌గేట్స్, మహిళా ఉద్యోగి మధ్య రోమాంటిక్ రిలేషన్‌షిప్‌పై రెండేండ్ల క్రితం మైక్రోసాఫ్ట్ విచారణ జరిపింది. ఈ సంగతి బిల్‌గేట్స్, ఆయన సతీమణి మిలిందా ఫ్రెంచ్ గేట్స్ తమ 27 ఏండ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలికి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాక వెలుగు చూడటం గమనార్హం.
కొత్త ఐటీ నిబంధనలతో పౌరుల ప్రైవసీ ఉల్లంఘనే: వాట్సాప్
జగన్ బెయిల్ విచారణ జూన్ 1కి వాయిదా
Flipkart Shop From Home Days sale: ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ సేల్
మొదటి డోసు కోవిషీల్డ్.. రెండోసారి కోవాగ్జిన్
జూన్ 1 నుంచి అలిపిరి నడక మార్గం మూసివేత
యాస్‌తో 3 లక్షల ఇండ్లకు నష్టం : మమతా బెనర్జీ
ఉత్తరాది ఓటర్లపై డీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు
చిన్న పరిశ్రమలకు త్వరలో ఉద్దీపన ప్యాకేజీ
బంగారం కొనుగోలుదారులకు ఊరట.. ఎందుకంటే?!
బంగారం బుల్ రంకె.. నెలలోనే 7% పైపైకి?!
ఆటో కంపెనీల వారంటీ, ఫ్రీ సర్వీస్ పీరియడ్ పొడిగింపు!
గల్వాన్ సరిహద్దు ఘర్షణ వేళ.. డ్రాగన్‌కు ఆ ఎగుమతులు రెట్టింపు!!
డైమండ్ ట్రేడర్ నుంచి.. ఆసియా బిలియనీర్ వరకూ..!!
200 కోట్ల డోస్‌ల ఉత్పత్తికి వాక్‌హార్డ్ రెడీ.. కానీ?!