శనివారం 11 జూలై 2020
Telangana - Jun 26, 2020 , 22:16:34

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ‘నావికాదళం’ కృతజ్ఞతలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ‘నావికాదళం’ కృతజ్ఞతలు

హైదరాబాద్‌: నావికాదళం డిప్యూటీ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ ఎంఎస్‌ పవార్‌ సీఎం కేసీఆర్‌ కు లేఖ రాశారు. గాల్వన్‌ ఘర్షణలో అమరుడైన కల్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి సీఎం కేసీఆర్‌ ఉదారమైన పునరావాస ప్యాకేజీ ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ ప్రకటన ఇప్పటివరకు సైనికులకు ఎవరూ చేయని సాయమని, ఈ నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు  తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.  సీఎం కేసీఆర్‌ బాట ఇతర రాష్ర్టాల సీఎంలు అనుసరించే విధంగా ఉంది. మాతృభూమిని రక్షించడానికి భారత సైనికుల ఎన్నడూ వెరవలేదు. అందుకు చరిత్రలో ఎన్నో సాక్షాలున్నాయి. అలా అమరులైన ఎందరో సైనికుల పేర్లను జాతి గుర్తు పెట్టుకుందన్నారు. మీ చర్య ప్రతీ ఒక్కరినీ కదిలించేలా, స్ఫూర్తి నింపేలా చేసిందని సీఎం కేసీఆర్‌ ను ఎంఎస్‌ పవార్‌ కొనియాడారు. దేశం కోసం ప్రాణ త్యాగానికైనా సిద్దపడేలా ఆలోచింపజేసింది. దేశం కోసం తాము అమరులమైతే తమ కుటుంబానికి జాతి యావత్తు అండగా ఉంటుందనే నమ్మకమైన సందేశాన్నిచ్చిందన్నారు. 

సంతోష్‌బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్‌ రూ.5 కోట్లు నగదు చెక్‌ అందజేసిన విషయం తెలిసిందే. సంతోష్‌బాబు కుటుంబానికి ఇంటి స్థలం, ఆయన భార్యకు గ్రూప్‌-1 స్థాయి ఉద్యోగం ఇస్తూ ప్రభుత్వం జీవో జారీచేసింది. 


logo