బుధవారం 27 జనవరి 2021
Telangana - Jan 09, 2021 , 00:05:57

10న ఎమ్మార్పీఎస్‌ సమావేశం

10న ఎమ్మార్పీఎస్‌ సమావేశం

ముషీరాబాద్‌, జనవరి 8: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు సాధించడమే లక్ష్యంగా ఈ నెల 10న ఎమ్మార్పీఎస్‌ రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. దళితుల వాటా నిధులు సాధించడంతోపాటు దళితవాడల్లో అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్‌ పనులు తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. ఉపప్రణాళిక నిధులు దళితుల కే కేటాయించాలనే విషయంపై చర్చిస్తామని తెలిపారు.


logo